Tirumala Tirupati Brahmotsavam

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతీ ఏటా దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‍ 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా అక్టోబర్‍ 16న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబరు 18న అంకురార్పణతో మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‍ 27న చక్రస్నానంతో ముగియనున్నాయి.