Russia Approves Coronavirus Vaccine Before Completing Tests

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడటానికి వివిధ దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి కొన్ని కోట్లు కర్చుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా , ఇండియా ,చైనా వంటి దేశాలు తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగం లో ఉండగా మంగళవారం 11 ఆగస్టు న రష్యా ప్రపంచంలో విజయవంతం గా మొదటి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేసినట్లు రష్యా అద్ధ్యక్షులు వ్లాదిమిర్ వ్. పుతిన్ ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా చివరిదశ క్లినికల్ ప్రయోగాలని పూర్తి చేసుకోలేదు అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

రాజకీయ లబ్ధి కోసం మాస్కో కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదు అని మరియు గమలేయ ఇన్స్టిట్యూట్ కనుగొన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను లోపం లేని వ్యాక్సిన్‌ గా పరిగణించాలి అంటే అధిక నియంత్రణతో ఉన్న వేలాది మంది వాలంటీర్లపై 3 వ దశ పరీక్షలను నిర్వహించాలి ఎప్పుడు అయితే 3 వ దశ పరీక్ష విజయవంతం అవుతుందో అప్పుడు వ్యాక్సిన్‌ సురక్షితమైనది మరియు సమర్థవంతమైనది గా ప్రకటిస్తారు

అయతే గమలేయ ఇన్స్టిట్యూట్ ఇంకా 3 వ దశ పరీక్షలను నిర్వహించలేదు అని మరియు భద్రత , వ్యాక్సిన్‌ ప్రభావం కోసం వ్యాక్సిన్‌ను పరీక్షించే సాధారణ పద్ధతుల నుండి రష్యా తప్పుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం హెచ్చరించిన రష్యా అద్ధ్యక్షులు మిస్టర్ పుతిన్ ట్రయల్స్ సరిపోతాయని మొండిగా ఉన్నారు అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

రష్యా, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రెండు వేలకు పైగా ప్రజలు పాల్గొన్నే 3 వ దశ పరీక్ష బుధవారం 12 ఆగస్టు న ప్రారంభమవుతుందని , కానీ రష్యాకు ఇప్పటికే 20 దేశాల నుండి ఒక బిలియన్ మోతాదుకు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి ఆర్డర్లు వచ్చాయని, ఈ వ్యాక్సిన్‌ను బ్రెజిల్, ఇండియా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా మరియు క్యూబాలో తయారు చేయాలని యోచిస్తున్నట్లు గమలేయ ఇన్స్టిట్యూట్ తెలిపినట్టు న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది.