scientists-from-india-us-can-widen-research-under-special-tech-fund-envoy-

కరోనాపై కదనానికి భారత్‍, అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వర్చువల్‍ వేదికగా కలిసికట్టుగా పనిచేయనున్నారు. కొంగొత ఆవిష్కరణలు, పరిజ్ఞానాన్ని పరస్పరం బదిలీ చేసుకోనున్నారు. ఇందుకు భారత్‍, అమెరికా శాస్త్ర-సాంకేతిక సహాయక నిధి (ఐయూఎస్‍టీఈఎఫ్‍) నుంచి సహాయ సహకారాలు అందనున్నాయి. ఆరోగ్య, వైద్యరంగ పరిశోధనల్లో భారత్‍, అమెరికా భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన వెబినార్‍లో అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‍సింగ్‍ సంధు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా, వైద్య, రంగ సహాయక ఉత్పత్తుల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్న ఇరుదేశాల పరిశోధనా సంస్థలు, శాస్త్రవేత్తలకు ఈ నిధి నుంచి ఆర్థికసహకారం లభిస్తుందన్నారు. దీంతో పాటు వారు కలిసి పనిచేసేందుకు అవసరమైన ప్రత్యేక వర్చువల్‍ వేదిక కూడా ఏర్పాటవుతుందని వెల్లడించారు.