biden-selects-california-sen-kamala-harris-as-running-mate

అమెరికా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డెబ్బై ఏడు సంవత్సరాల(77 ) మిస్టర్ బిడెన్ 2024 లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి గా ఎన్నికల బరిలోకి దిగుతారు అని నిబద్ధత లేనందున ఆయన ఎన్నుకునే ఉపాధ్యక్షులు 2024 డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థి గా ఎన్నికల బరిలో దిగే బలమైన అవకాశం ఉండడం తో పాటు కొన్ని నెలల క్రితం “డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షలు గా ఒక మహిళను ఎన్నుకుంటాను” అని ప్రకటించిన మిస్టర్ బిడెన్, ఆయన జాబితా లో ఉన్న పదమూడు మంది మహిళా నాయకులు నుంచి ఎవరిని ఎన్నుకోనున్నారు అని కొన్ని నెలలుగా సర్వత్రా నెలకొన్న ఆసక్తి కి మంగళవారం 11 ఆగస్టు న తెరపడింది.

2017 నుండి కాలిఫోర్నియా సెనేటర్ గా కొనసాగుతున్న మాజీ అధ్యక్ష అభ్యర్థి , శాన్ ఫ్రాన్సిస్కోలో జిల్లా న్యాయవాదిగా మరియు రాష్ట్ర అటార్నీ జనరల్‌గా పనిచేసిన కమలా హారిస్ ను డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షులు గా 2020 అధ్యక్ష అభ్యర్థి మిస్టర్ బిడెన్ ప్రకటించారు. 1984 లో డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జెరాల్డిన్ ఫెరారో మరియు 2008 లో రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా సారా పాలిన్ విధులు నిర్వహించిన తర్వాత 55 ఏళ్ల హారిస్ ఒక ప్రధాన రాజకీయ పార్టీకి ఉపాధ్యక్ష అభ్యర్థిగా పనిచేసిన మూడవ మహిళ కావడం విశేషం.

అమెరికన్ ప్రజల బాధలను అర్థం చేసుకుని అమెరికా ప్రజల తో మమేకం అయ్యే నాయకురాలు, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉద్యోగం పోగొట్టుకొని , వ్యాపారాలు దెబ్బతిని ఆర్థిక సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొంటున్న అమెరికన్ ప్రజలని పట్టించుకోని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బారి నుంచి అమెరికా ప్రజలను రక్షించగల, తెలివైన, కఠినమైన అన్నిటికీ మించి నాయకత్వం వహించగల సమర్ధవంతమైన నాయకురాలు కమలా హారిస్ ని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలు గా ఎన్నుకున్నట్లు మిస్టర్ బిడెన్ ప్రకటించారు.

“మా పార్టీ కి ఉపాధ్యక్షురాలు గా మిస్టర్ బిడెన్ నను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందాన్ని మరియు గౌరవాన్ని అన్నిటికీ మించి భాధ్యతను ఇచ్చింది, అమెరికా ప్రజలు కోరుకునే అమెరికా కేవలం మిస్టర్ బిడెన్ నాయకత్వం తోనే సాధ్యం అందుకు నేను డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలు గా న పూర్తి సహకారం అమెరికా కు కాబోయే అద్ధ్యక్షులు మిస్టర్ బిడెన్ కి అందిస్తాను” అని కమలా హారిస్ ట్వీట్ చేశారు. బిడెన్ యొక్క స్వస్థలమైన డెలావేర్లోని విల్మింగ్టన్లో బుధవారం 12 ఆగస్టు జరగనున్న సమావేశంలో బిడెన్ మరియు హారిస్ కలిసి ఒకే వేదిక పైన ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మిస్ కమలా హారిస్ ని ఉపాధ్యక్షురాలు గా ఎన్నుకోవడం పై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేయగా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా అగౌరవ మహిళలగా మిస్ కమలా హారిస్ ని వ్యాఖ్యానించారు మిస్టర్ బిడెన్ ని ప్రైమరీ ఎన్నికల సమయంలో మిస్ కమలా హారిస్ ఎంత అగౌరవం గా మాట్లాడారో మిస్టర్ బిడెన్ మర్చిపోయి ఉంటారు అని వ్యాఖ్యానించారు.