YS Jagan Confirms Penmetsa Suresh Babu as MLC Candidate

దివంగత పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్‍ పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‍ కుమార్‍)ను ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి ఎమ్మెల్సీ పదవికీ ఎంపిక చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13న సురేష్‍ నామినేషన్‍ను వేయనున్నారు. వైఎస్సార్‍సీపీ సీనియర్‍ నేత సాం•శివరాజు మృతి చెందడం తెలిసిందే. సాంబశివరాజు కుటుంబాన్ని రాజకీయంగా ఆదరించాలనే ఉద్దేశంతో సురేష్‍ పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్‍ బాబు పేరును జగన్‍ నిర్ణయించారు.