India comes a close second after US in COVID 19 testing says Donald Trump

కరోనా వైరస్‍ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉన్నదని, ఆ తర్వాతి స్థానం భారత్‍దేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలిపారు. కొవిడ్‍ టెస్టుల్లో అమెరికాకు దరిదాపుల్లో మరేదేశం లేదని ఆయన సృష్టం చేశారు. భారత్‍ రెండో స్థానంలో ఉన్నా.. అది అమెరికాను మించలేదన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‍ మీడియాతో మాట్లాడుతూ అమెరికాలో ఇప్పటి వరకు 65 మిలియన్ల కోవిడ్‍ టెస్టులు నిర్వహించాం. ఇదే ప్రపంచలో అత్యధికం. ఆ తర్వాత 150 కోట్ల జనభా ఉన్న భారత్‍లో 11 మిలియన్ల టెస్టులు నిర్వహించి రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశం నిర్వహించలేనన్ని నాణ్యమైన టెస్టులను అమెరికా నిర్వహించింది. ఈ విషయంలో అమెరికాను  ఏ దేశం అందుకోలేదు అని ట్రంప్‍ పేర్కొన్నారు.