Suresh Kumar is new CEO of TTD s SVBC

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‍ (ఎస్‍వీబీసీ) సీఈఓగా ఇండియన్‍ ఇన్ఫర్మేషన్‍ సర్వీస్‍ (ఐఐఎస్‍) అధికారి జి.సురేశ్‍ కుమార్‍ని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం విజయవాడ దూరదర్శన్‍ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్‍ (న్యూస్‍)గా పనిచేస్తున్న సురేశ్‍కుమార్‍ డిప్యుటేషన్‍పై రాష్ట్ర సర్వీసుకి వచ్చారు. ఆయన మూడేళ్లపాటు రాష్ట్ర సర్వీసులో కొనసాగుతారు.