WION. Former champion Svetlana Kuznetsova latest to withdraw from U.S. Open

యుఎస్‍ ఓపెన్‍ నుంచి మరో స్టార్‍ క్రీడాకారిణి వైదొలిగింది. 2004 యుఎస్‍ ఓపెన్‍ ఛాంపియన్‍ స్వెత్లానా కుజ్‍నెత్సొవా (రష్యా) ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు ఇన్‍స్టాగ్రామ్‍లో ప్రకటించింది. యుఎస్‍ ఓపెన్‍ నుంచి తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడేందుకు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. కరోనా నా ప్రణాళికలన్నింటినీ దెబ్బ కొట్టింది అని కుజ్‍నెత్సొవా చెప్పింది. 2009లో ఫ్రెంచ్‍ ఓపెన్‍ గెలిచిన ఈ రష్యా తార.. ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆమె 35వ ర్యాంకులో ఉంది. ఈ నెల 31న యుఎస్‍ ఓపెన్‍ ఆరంభం కానుంది.