Plasma is Sanjeevani donate it says Megastar Chiranjeevi

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన మెగాస్టార్ ప్లాస్మా డొనేట్ చేయండి అని కమిషనర్ ఆఫీసు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.  లాక్ డౌన్ పెట్టినప్పటినుండి  మన  హీరోలు ఇంటికే పరిమితమైపోయారు.   యంగ్ హీరోస్  మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ ఇలా చాలా మంది అల వైకుంఠపురములో, ఆమూల సౌంధంబులో అన్నట్లు ఇళ్లకే పరిమితం అయిపోయారు.  బాలకృష్ణ తన హాస్పటల్ కార్యక్రమాల్లో మాత్రం ఒకటి రెండు సార్లు కనిపించారు.  నాగ్ బిగ్ బాస్ కు మాత్రం ఓ ప్రోమో షూట్ చేసారని వార్తలు వచ్చాయి. నాగ్ అస్సలు జాడ లేదు. వెంకీ అయితే మొన్న రానా పెళ్ళిలో కనిపించారు బయట ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. మొన్న ఈమధ్య  ప్రభాస్ తన స్వంత పని మీద ఆర్జీవో ఆఫీస్ కు వచ్చి వెళ్లారు. మోహన్ బాబు అయితే ఫుల్ రెస్ట్ మోడ్ లో వున్నారు.  కానీ అరవై దాటినా మెగాస్టార్ చిరంజీవి మాత్రం వీరందరికీ  భిన్నంగా  కరోనా వ్యాప్తి బాగా వుందని తెలిసినా, ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహించడానికి స్వయంగా పోలీస్ కమిషనరేట్ కు వెళ్లారు. వెళ్లడమే కాదు, తన స్టాఫ్ లో కరోనా వచ్చి తగ్గిన వారిని తీసుకెవెళ్లి, ప్లాస్మా డొనేషన్ చేయించారు. నిజానికి ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా వెళ్లకపోయినా ఓకె.  ఓ బైట్ ఇచ్చినా చల్తా. కానీ అలా చేయకుండా ఆయన స్వయంగా వచ్చి, సరాదాగా మాట్లాడి వెళ్లడం అంటే ఆయన రూటే సెపరేట్ అనుకోవాలి.