MLC Jakiya Khanam Met YS Jagan

నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‍కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగన్న అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని రాయచోటి అభివృద్ధికి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మైనారిటీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం కేవలం వైఎస్‍ జగన్‍కే సాధ్యమవుతుందని కొనియాడారు. మహిళా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‍ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‍ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.