Andhra Pradesh govt moves Supreme Court seeks vacation of HC stay order

ఆంధప్రదేశ్‍ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‍డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‍ కో ని ఎత్తివేయాలని ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‍ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‍ కాపీని కెవియట్‍ వేసిన వారికి పంపినట్లు ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‍కు లేఖ పంపింది. ప్రతివాదులకు పిటిషన్‍ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‍డీఏ రద్దు బిల్లులకు ఇటీవల గవర్నర్‍ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం రాజపత్రం కూడా విడుదల చేసింది. దీనిని సవాల్‍ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‍ దాఖలు చేశారు. దీంతో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‍డీఏ రద్దుపై కోర్టు స్టేటస్‍ కో విధించింది. ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేటస్‍కోను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.