HHS Secretary Alex Azar to Lead Delegation to Taiwan

దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి తైవాన్‍లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆరోగ్య శాఖ కార్యదర్శి అలెక్స అజార్‍ తైవాన్‍ చేరుకున్నారు. 1979లో చైనాకు దౌత్యపరమైన గుర్తింపు మారినప్పటి నుంచి అమెరికాకు ఉన్నతస్థాయి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ పర్యటనను చైనా ఖండించింది. అలెక్స తన పర్యటనలో భాగంగా తైవాన్‍ అధ్యక్షుడు త్సాయి ఇంగ్‍వెన్‍తో సమావేశం కానున్నారు. నేడు ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని ఇంగ్‍వెన్‍ కార్యాలయం పేర్కొంది. తైవాన్‍ను సార్వభౌమ దేశంగా గుర్తించాలని ఆయన గత కొంత కాలంగా డిమాండ్‍ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‍ మంత్రివర్గంలో అజార్‍ సీనియర్‍ మంత్రిగా ఉన్నారు.