Researchers created a test to determine which masks are the least effective

ఇన్ఫెక్షన్‍ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే నీటీ తుంపరలు కరోనా వైరస్‍కు వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఈ వైరల్‍ తుంపరలకు అడ్డుకట్ట వేసి నిలువరించడంలో మాస్క్లు ఎంతమేర ప్రభావంతంగా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు అమెరికాలోని డ్యూక్‍ వర్సిటీ శాస్త్రవేత్తలు అతి చౌక పద్ధతిని అభివృద్ధి చేశారు. రూ.15వేల లోపు ధరకు లభించే ప్రత్యేక హార్డ్వేర్‍ కిట్‍ను ఇందుకు ఉపయోగించినట్లు తెలిపారు. అధ్యయనంలో భాగంగా 14 రకాల మాస్క్లతో జరిపిన టెస్టింగ్‍లలో ఎయిర్‍ వాల్వ్ లేని ఎన్‍ 95 మాస్క్, సర్జికల్‍ మాస్క్, హ్యాండ్‍ మేడ్‍ కాటన్‍ ఫేస్‍ కవరింగ్‍లు తుంపరల నిరోధంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.