Somu Veerraju Will Take Charge As AP BJP Chief On 11

బీజేపీ ఆంధప్రదేశ్‍ రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజవాయడ లోని ది వెన్యూ ఫంక్షన్‍ హాలులో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‍, అఖిల భారత సంఘటన సహ కార్యదర్శి సతీష్‍ హాజరుకానున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ వ్యవహరాల సహ ఇంఛార్జి సునీల్‍ దేవధర్‍, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్‍, సన్యాసిరాజు, శ్రీరామ్‍, శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు.