Trump keeps pushing for a payroll tax

అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శనివారం 8 ఆగస్టు కొత్త కరోనావైరస్ రెస్క్యూ ప్యాకేజీ పై కాంగ్రెస్‌ తో చర్చలు విఫలం అయిన తరువాత దేశ శాసనసభ్యులను పక్కన పెట్టి పేరోల్ పన్నులను వాయిదా వేసే మరియు గడువు ముగిసిన నిరుద్యోగ ప్రయోజనాన్ని తక్కువ మొత్తంతో భర్తీ చేసే కార్యనిర్వాహక ఆదేశాలు పై సంతకం చేసినట్లు తెలిసింది. అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ సంతకం తో ఫెడరల్ వ్యయం పై కాంగ్రెస్ నియంత్రణ కోల్పోయినట్లు కాంగ్రెస్ భావిస్తే అధ్యక్షులు ట్రంప్ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు యుఎస్ న్యూస్ తెలిపింది.

ఆగస్టు 1 నుండి సంవత్సరం చివరి వరకు ఉద్యోగులు చెల్లించే పేరోల్ పన్ను భాగాన్ని వాయిదా వేస్తున్నట్లు మరియు కొన్ని నిరుద్యోగ ప్రయోజనాల పొడిగింపుతో పాటు సమాఖ్య విద్యార్థుల రుణాలు చెల్లింపులు మరియు తొలగింపులను నిలిపివేసే ప్రయత్నాలను కూడా వాయిదా వేస్తున్నట్లు అధ్యక్షులు ట్రంప్ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మిలియన్ల మంది అమెరికా ప్రజలు ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే వీరికి, వారానికి 600 డాలర్స్ సహాయం అందించే అనుబంధ ఫెడరల్ నిరుద్యోగ ప్రయోజన పథకం గడువు ఆగస్ట్ 1 న ముగియడంతో చట్టసభ .సభ్యులు ఈ పథకం పై ఇంకా ఒక ఒప్పందానికి రాకపోవటం వల్ల 600 డాలర్స్ కంటే ఒక వంతు తక్కువ తో నిరుద్యోగులకు ప్రతి వారం 400 డాలర్స్ చెల్లించాలని ఆదేశాలు జారీచేసినట్లు అధ్యక్షులు ట్రంప్ తెలిపారు.

దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి చట్టసభ సభ్యులు ఒక ఒప్పందం కుదుర్చుకోలేక పోవడం వల్ల సంక్షేమ పథకాలు అమలు ఆలస్యం అవుతుండటంతో , 2020 నవంబర్ లో జరిగే ఎన్నికల పై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నందున అధ్యక్షులు ట్రంప్ వరస కార్యనిర్వాహక సంతకాలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాల నేపథ్యంలో ట్రంప్ చర్యలను "చాలా తక్కువ" అని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్ మైనారిటీ నాయకుడు చక్ షుమెర్ భావించినట్లు తెలిసింది అయితే “ఉద్యోగుల చెల్లించే పన్ను తో 7% ఆదాయ మరియు యజమానులు తమ పేరోల్స్‌లో 7.65% ని కూడా ఫండ్లలోకి చెల్లించే పేరోల్ పన్నులను వాయిదా వేయడం వల్ల మెడికేర్ మరియు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలకు ఎలా నిధులు సమకూరుస్తారు అని ప్రశ్నిస్తూ అధ్యక్షులు ట్రంప్ డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ ఈ ఉత్తర్వులను "సగం కాల్చిన చర్యల శ్రేణి" అని వ్యాఖ్యానించారు మరియు పేరోల్ పన్ను ద్వారా నిధులు సమకూర్చే సామాజిక భద్రతకు ప్రమాదం ఉందని ఆరోపించారు.