Russia working to boost Trump s reelection and denigrate Biden as China undermines Trump

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రష్యా, చైనా, ఇరాన్‍లు జోక్యం చేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఆరోపించారు. రష్యా పరోక్షంగా జోక్యం చేసుకుంటోందనీ, చైనా, ఇరాన్‍లు నేరుగానే జోక్యం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. నేషనల్‍ కౌంటర్‍ ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా తాను మాట్లాడుతున్నానని ఆయన ట్విట్టర్‍ లో తెలిపారు. అమెరికాను బలహీన పర్చేందుకు చైనా, ఇరాన్‍లు కంకణం కట్టుకున్నాయనీ, అయితే, ఆ రెండు దేశాల ప్రయత్నాలు ఫలించవని ట్రంప్‍ సృష్టం చేశారు. ట్రంప్‍ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడం చైనాకు ఇష్టం లేదని కౌంటర్‍ ఇంటిలిజెన్స్ డైరెక్టర్‍ విలియమ్‍ ఎవనినా తెలిపారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.