google-eyes-policybazaar-may-buy-10-stake-for-150-million-reports

భారత్‍లో అమెరికా టెక్నాలజీ దిగ్గజాల కొనుగోళ్ల వేట కొనసాగుతోంది. ఈ మధ్యనే జియో ప్లాట్‍ ఫామ్స్లో వాటా కొనుగోలు చేసిన గూగుల్‍.. తాజాగా మరో కంపెనీలో పెట్టుబడులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఆన్‍లైన్‍ బీమా సేవల ప్లాట్‍ఫామ్‍ పాలసీబజార్‍ డాట్‍ కామ్‍లో 10 శాతం వాటాను 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.125 కోట్లు) కు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్‍ ఇన్వెస్ట్మెంట్‍ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్‍కు పాలసీబజార్‍లో 15 శాతం వాటా ఉంది. ఇందులో కొంత గూగుల్‍కు విక్రయించే అవకాశం ఉంది.