Stan Wawrinka To Skip US Open Due To Coronavirus

ఈ ఏడాది యూఎస్‍ ఓపెన్‍ గ్రాండ్‍స్లామ్‍కు దూరం కానున్న స్టార్‍ ఆటగాళ్ల జాబితాలో మాజీ చాంపియన్‍, స్విస్‍ స్టార్‍ స్టానిస్లాస్‍ వావ్రింకా చేరాడు. కొవిడ్‍ విజృంభణ నేపథ్యంలో తాను ఆ గ్రాండ్‍ స్లామ్‍లో ఆడడం లేదని ప్రపంచ 17వ ర్యాంకరైన వావ్రింకా ప్రకటించారు. ఆరోగ్య భద్రత రీత్యా న్యూయార్క్ వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో యూఎస్‍ ఓపెన్‍కు దూరం కాక తప్పడం లేదు అని 2016 విజేత అయిన వావ్రింకా తెలిపాడు. ఈ నెల 31న యూఎస్‍ ఓపెన్‍ మొదలవనుంది.