Kanipakam Varasiddi Vinayaka Brahmotsavams to begin on Aug 22

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. సెప్టెంబర్‍ 11 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.