US IT firm The Boston Group to setup a centre at Vizag

ది బోస్టన్ గ్రూప్ (TBG) 1988 లో విజయవాడ కి చెందిన మన తెలుగు వారు శ్రీ సుబ్బుకోటా ఇండియన్- అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త ఫార్చ్యూన్ 500 సంస్థలతో పాటు మధ్యస్థ పరిధి కి చెందిన సంస్థలకు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ మరియు ఐటీ సేవలు అందించడానికి మొదలు పెట్టి నెమ్మదిగా ఐటీ అవుట్ సోర్సింగ్, ఈ- లెర్నింగ్ , వర్టికల్ మార్కెట్ సోలుషన్స్, ఈ-గవర్నెన్స్ రంగాల్లో కి విస్తరించి ప్రముఖ ఐటీ కంపెనీ గా కొనసాగుతున్న TBG ఇప్పటికే వివిధ దేశాల్లో తమ శాఖలు ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తూ, ఇప్పుడు కొత్తగా మన విశాఖపట్నం లో వారి శాఖను ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో MoU కుదుర్చుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత విశాఖపట్నం ఐటీ-హబ్ గా మారి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుకు సాగడం ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే వివిధ సంస్థలు విశాఖపట్నం లో వారి శాఖలు ప్రారంభించగా TBG సంస్థ 5th ఆగస్టు బుధవారం TBG చైర్మన్ శ్రీ సుబ్బుకోటా, ఉత్తర అమెరికా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రత్నాకర్ పాండుగా యల సమక్షం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తో MoU పై సంతకం చేసారు.

ఈ సంతకం తో షుమారుగా 250 కి పైగా కొత్త ఐటీ ఉద్యోగాలు ఆంధ్ర ప్రదేశ్ యువతకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయం లో భారీ సంభావ్యత ఉన్న విశాఖపట్నం వంటి నగరాలతో తోడ్పాటులు కీలకమైనవి గా వివరిస్తూ TBG విశాఖపట్నం శాఖ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన R&D విభాగం పై TBG విశాఖపట్నం శాఖ పనిచైయనుంది అని TBG చైర్మన్ శ్రీ సుబ్బుకోటా తెలిపారు.