Education Lawsuits Are Growing During The COVID 19 Pandemic

అమెరికన్ రాజకీయ నాయకులు కరోనా వైరస్ మహమ్మారి ఉపశమన ప్యాకేజీపై గొడవలు పడుతుండగా, విద్యా సంస్థలు విద్యార్థులకు ఇన్-పర్సన్ బోధనను ప్రారంభించాలా వద్దా అనే దానిపై మధన పడుతున్న సమయంలో అమెరికా శనివారం 8th ఆగస్టు న ఐదు మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదు చేసి కరోనా వైరస్ కేసుల నమోదు లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

నమోదు అయిన కరోనావైరస్ కేసులు పై సమాఖ్య, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంతవరకు ఏ దేశం ఇంత సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదు చేయలేదు అని మరియు మూడు మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులతో బ్రెజిల్ రెండవ స్థానంలో, రెండు మిలియన్లతో భారత్ మూడవ స్థానంలో ఉన్నాయి అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

కరోనా వైరస్ ప్రభావం కారణంగా గతంలో ఆరోగ్యంగా ఉన్న అమెరికాలోని వందలాది మంది పిల్లలు కోవిడ్ -19 తో సంబంధం ఉన్న ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌ తో బాధపడుతున్నట్లు మరియు వారికి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఒక కొత్త నివేదిక తెలుపగా , చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలో ఒహియో లోని ఫ్రాంక్లిన్ కౌంటీ, స్ప్రింగ్ఫీల్డ్ మరియు కాలిఫోర్నియా లోని కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇన్-పర్సన్ బోధనను ప్రారంభించాలి అని విద్యాసంస్థ బోర్డు మరియు ఆరోగ్య విభాగం పై ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించటం వల్ల వారి పిల్లల విద్యా వృద్ధి నాశనం అవుతుంది అని న్యాయస్థానంలో దావా వేసినట్లు తెలిసింది.