art director ravinder reddy turn director

కొత్త దర్శకులను పరిచయం చేయడంలో అక్కినేని నాగార్జున ముందుంటాడు ఎంతో మంది దర్శకులను తన సొంత సంస్థద్వారా టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత ఒక్క నాగార్జునకు సొంతం అనుకున్నాం కానీ తాజాగా యువి క్రియేషన్స్ సంస్థ ఆ బాధ్యతలు తీసుకుందనుకుంటా. రన్ రాజా రాం చిత్రంతో సుజిత్ ను, జిల్ చిత్రంతో రాధాకృష్ణను, ఎక్సప్రెస్ రాజా తో సెకండ్ మూవీ మేర్లపాక గాంధీని ఇలా పలువురిని పరిచయం చేసారు. ఇప్పుడు మరి కొంత మంది క్యూ లో వున్నారు. మేర్లపాక గాంధీ అసిస్టెంట్ ను కూడా డైరక్టర్ గా పరిచయం చేయబోతున్నారు. అలాగే యువి సంస్థకు అత్యంత ఆప్తుడు అయిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ రెడ్డిని కూడా డైరక్టర్ గా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.

రవీందర్ రెడ్డి కి ఎప్పటి నుంచో డైరక్టర్ కావాలని వుంది. ఆయన ఒకటి రెండు లైన్లు ఆలోచించి పెట్టుకున్నారు. యువితో ఆయనకు విడదీయలేని అనుబంధం వుంది. రాధేశ్యామ్ సినిమాకు టోటల్ ప్రొడక్షన్ డిజైనింగ్ అంతా ఆయనే. త్వరలో రాధేశ్వామ్ వర్క్ అయిపోయిన తరువాత మంచి కథ తయారు చేసుకుని మెగా ఫోన్ పడతారని తెలుస్తోంది. అందుకోసం రవీందర్ ఓ అద్భుతమైన థ్రిల్లర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఆర్ట్ డైరక్టర్లు దర్శకులుగా మారింది చాలా తక్కువ. మిగిలిన అన్ని విభాగాల నుంచి ఎక్కువగా డైరక్టర్లుగా మారుతుంటారు. టాలీవుడ్ లో తొలి సారిగా రవీందర్ ఇప్పుడు ఆ లోటు తీరుస్తున్నారు.