Chandrababu Condemns Arrest of JC Prabhakar Reddy and His Son Ashmit Reddy

తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్‍రెడ్డి, ఆయన కుమారుడు ఆస్మిత్‍ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వారి అరెస్టు వైకాపా సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. విడుదలైన 24 గంటల్లోగా మళ్లీ అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అన్నారు. కొవిడ్‍ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా నేతలపై ఒక్క కేసూ నమోదు కాలేదు. బహిరంగ సమావేశాలు పెట్టిన విజయసాయిరెడ్డి లాంటి వారిని వదిలేశారు. జేసీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నేతలను అడ్డుకోలేరు. జగన్‍ కక్ష సాధింపు చర్యలు నానాటికీ పెరుగుతున్నాయి. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు అని మండిపడ్డారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్‍ చేశారు. అక్రమ అరెస్టులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.