minister gajendra singh shekhawat wrote a letter to ap and telangana

ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍కు కేంద్ర జల్‍ శక్తి మంత్రి గజేంద్ర సింగ్‍ షెకావత్‍ లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్‍ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్రమంత్రి సూచించారు. పెండింగ్‍ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్‍ రెండో భేటీ త్వరలో జరగాలని చెప్పారు. నీటి వివాదాల గురించి లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్రమంత్రి లేఖలో వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించడం కోసం అపెక్స్ కమిటీ భేటీ అవుతుంటుంది. అయితే, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఈ నెల 5న జరగాల్సిన కమిటీ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర జల్‍ శక్తి మంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే అపెక్స్ కమిటీ భేటీ ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు. ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఇప్పటికే తెలంగాణలో పలు పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అపెక్స్ కౌన్సిల్‍ భేటీ ఎప్పుడూ జరుగుంతో, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.