Girish Chandra Murmu takes charge as Comptroller and Auditor General of India

భారత కంప్ట్రోలర్‍ అండ్‍ ఆడిటర్‍ జనరల్‍ (కాగ్‍)గా గిరీష్‍చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‍లో రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‍, పలువురు ఉన్నతాదికారులు హాజరయ్యారు. ముర్ము జమూ-కశ్మీర్‍ లెఫ్టినెంట్‍ గవర్నర్‍ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన 1985 బ్యాచ్‍ గుజరాత్‍ కేడర్‍ ఐఏఎస్‍ అధికారి.