Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటేసింది. రోజు రోజుకీ కరోనా మరణాల సంఖ్య  సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 10,171 కొత్త పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో మరో 89 మంది మరణించారు. ఇంతవరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కరోనా మరణాల్లో ఇవే ఎక్కువ. మొత్తం  కరోనా మరణాల సంఖ్య 1,841కు చేరింది.