OCI card holders can travel to India now

అమెరికా, బ్రిటన్‍, జర్మనీ,  ప్రాన్స్ల నుంచి ఓవర్సీస్‍ సిటిజన్స్ ఆఫ్‍ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు ఇక నుంచి సందర్శన నిమిత్తం భారత్‍కు రావచ్చని హోంశాఖ తెలిపింది. వైద్యం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఈ దేశాల నుంచి వచ్చే విదేశీయులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించింది. భారతీయులు కూడా ఏ రకమైన వీసాల ద్వారా నైనా ఈ దేశాలకు వెళ్లవచ్చని పేర్కొంది. ఈ మేరకు  ఆయా దేశాలతో పౌర విమానయాన శాఖ ద్వైపాక్షిక ఎయిర్‍ బబుల్‍ ఒప్పందం చేసుకున్నట్టు హోంశాఖ వర్గాలు తెలిపాయి.