Congress leader Nandi Yellaiah dies of COVID 19

కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కరోనాతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. సిద్దిపేట నుంచి ఐదుసార్లు, నాగర్‌కర్నూల్‌ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. కొన్నాళ్లు ఎమ్మెల్సీగానూ సేవలందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తమ సంతాపాన్ని తెలియచేసారు "టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. నంది ఎల్లయ్య మృతిపట్ల పలు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

మాజీ ఎంపి శ్రీ నంది ఎల్లయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నా. సిద్ధిపేట ఎంపిగా వారు ఉన్న సమయంలో నేను అక్కడి ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేశాను. రాజకీయాల్లో నిరాడంబరాన్ని చాటుకున్న మంచి మనసున్న వ్యక్తిత్వం శ్రీ ఎల్లయ్య గారిది"అన్నారు.