Dubai Calicut flight just crashed

దుబాయ్ నుంచి భారత్​ వస్తున్న 191 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కేరళ కోజికోడ్‌లో దిగేటప్పుడు రన్‌వేపై ప్రమాదానికి గురైంది. ఇప్పటివరకు ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తుంది, మొత్తంగా 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు భావిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. మరింత మంది మృతి చెందే అవకాశం ఉన్నట్లు అధికారులుభావిస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దిగబోతోంది. రన్‌వేను హఠాత్తుగా 30 అడుగుల ఎత్తు నుంచి నేలను డీకొట్టడంతో విమానం రెండు ముక్కలుగా విరిగింది. 7:38 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. విమానంలో సిబ్బందితో సహా 191 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్​ మృతి చెందినట్లు తెలుస్తుంది. సహాయక బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో భారీగా వర్షం పడుతుంది.