Vijaydevarakonda special look

ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టకపోయినా ఎవరికివారు లాక్ డౌన్ విదించుకున్నారు. ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపించే విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ లో ఈ సారి షర్ట్ లేకుండా తన పిక్ ని పోస్ట్ చేసాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేఅవరకొండ ఈ సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాడు. పూరీ డైరక్షన్ లో బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఫైటర్ సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ కు డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో దొరికితే ఎలా ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుందని చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు ఆడియెన్స్ అంచనాలకు కూడా ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇంట్లో ఖాళీగా ఉంటూ తన పెట్స్ తో టైం పాస్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గత నెలలో లైట్ బ్లూ షర్ట్ తో పిక్ పోస్ట్ చేస్తే 2 మిలియన్ల పైన లైక్స్ వచ్చాయి. మళ్ళి లేటెస్ట్ గా తన పెట్ తో ఆడుకుంటున్న పిక్ ను తన ఇన్ స్టాగాంలో పెట్టాడు విజయ్ దేవరకొండ. విషయం ఏంటంటే తన సినిమాల్లో ఎప్పుడు కనిపించే షర్ట్ లెస్ బాడీతోనే పిక్ షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. రియల్ పిక్ అయినా కూడా రీల్ పిక్ లా కనిపించడం విశేషం. అందరు హీరోలు ఒకదారి అయితే విజయ్ దేవరకొండది మరోదారి. ఎలాంటి మొహమాటం లేకుండా బాడీని చూపించేస్తాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి కాగా మరో రెండు షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. అసలైతే సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.