Writer Paruchuri Venkateswara Rao s wife Vijayalakshmi dies at 74

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారి భార్య పరుచూరి విజయలక్ష్మి గుండె పోటు తో చనిపోయారు.  విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయ లక్ష్మి గుండెపోటు తో మరణించడం టాలీవుడ్ ని విషాదం లోకి నెట్టింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న నటులు, అప్పటి స్టార్ హీరోలు  తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు అందరి స్టార్ హీరోలతో పరుచూరి బ్రదర్స్ కి మంచి  అనుబంధం ఉంది. అందరి హీరోలతో కలిసి వారు సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అందరికి  పరుచూరి బ్రదర్స్ కథ అందిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే  పరుచూరి వెంకటేశ్వరరావు భార్యను కొందరు తల్లిగా వదినగా భావిస్తూ ఉంటారు. నేడు ఆవిడ గుండెపోటుతో మరణించడం తో కన్నీరు పెడుతున్నారు. కరోనా  కారణంగా కొందరు  ఫోన్ చేసి ఆయన్ను పరామర్శిస్తున్నారు. మరి కొందరు ఇంటికి వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ నివాళి అర్పిస్తున్నారు. స్టార్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, పవన్ కళ్యాణ్ సహా కొందరు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ... ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు గారి సతీమణి శ్రీమతి విజయ లక్ష్మి గారు కన్నుమూశారని తెలిసి చింతించానని పేర్కొన్నారు.