Andhra Pradesh forms committee for reorganisation of districts

ఆంధప్రదేశ్‍లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కేబినెట్‍ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్‍ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎస్‍ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆరుశాఖల అధికారులు సీసీఎల్‍ఏ కమిషనర్‍, జీఏడీ సర్వీసెస్‍ కార్యదర్శి.. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, కమిటీ కన్వీనర్‍గా ప్రిన్సిపల్‍ ఫైనాన్స్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు.