1 2 Million Americans File For Unemployment

కరోనా వైరస్ సంక్షోభం తో అమెరికా లోని చాలా వ్యాపార దిగ్గజాలు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నట్లు తెలిసింది అయితే అమెరికాలో నిరుద్యోగ సంక్షేమ పథకం కోసం దాఖలు చేసిన వారి సంఖ్య ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గురువారం 6th ఆగస్టు న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకటించిన నివేదిక ప్రకారం షుమారుగా 1.2 మిలియన్ అమెరికా ప్రజలు నిరుద్యోగ సంక్షేమ పథకం కోసం దాఖలు చేసుకోగా మరొక 655,707 ప్రజలు కోవిద్ -19 నిరుద్యోగ సహాయం కార్యక్రమం కింద దాఖలు చేసుకున్నట్లు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకటించిన నివేదిక తెలిపింది. 

ఇది మునుపటి అన్ని నిరుద్యోగ సంక్షోభ రికార్డులను బద్దలు కొట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అయితే కోల్పోయిన చాలా ఉద్యోగాలు తాత్కాలికమైనవి కాకపోవటంతో అమెరికా ప్రజలని మరియు ప్రభుత్వాని ఈ నిరుద్యోగ సంక్షోభం భయాందోళనికి గురి చేస్తున్నట్లు తెలిసింది. మార్చి నెలలో 3.5% నిరుద్యోగిత రేటు ను అమెరికా నమోదు చేయగా ఆగస్టు నెలలో ఊహించని స్థాయిలో నిరుద్యోగిత రేటు నమోదు అయినట్లు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.