Moderna vaccine candidate protects mice from Covid 19 finds study

అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న టీకా ఎలుకల్లో సమర్థమంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఆ టీకా పనిచేసిన విధానం గురించి నేచర్‍ జర్నల్‍లో ప్రచురించారు. ప్రయోగ దశలో ఉన్న ఎంఆర్‍ఎన్‍ఏ-1273 అనే టీకాను మూడు వారాల వ్యవధిలో ఒక్కో మెకోగ్రామ్‍ చొప్పున రెండు సార్లు ఎలుకల కండరాల్లోకి ఇంజెక్షన్‍ ద్వారా పంపించారు. ఇది  ఎలుకల్లో వైరస్‍ను చంపే వ్యాధి నిరోధకాలను ప్రేరేపించింది.