Companies Supporting Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ జోరుగా సాగుతోంది. రిపబ్లికన్‍ పార్టీ, డొనాల్డ్ ట్రంప్‍ ప్రచార బృందం సంయుక్తంగా 16.5 కోట్ల డాలర్లను అత్యధికంగా ఒక్క జులైలోనే విరాళంగా పొందారు. రిపబ్లికన్‍ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 1.1 బిలియన్‍ డాలర్లు వారికి విరాళంగా వచ్చాయి. అందులో 30 కోట్ల డాలర్ల వరకు నగదు రూపంలో ఉన్నాయని రిపబ్లికన్‍ పార్టీ ప్రకటించింది.