ap mlc notification

ఆంధప్రదేశ్‍ శాసనసభ కోటా నుంచి ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్‍ జారీ అయింది. తొలి రోజున నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలం రీత్యా అధికార వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం లాంఛనమే. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణారావు తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.