Telangana government sanctions Rs 400 crore for new Secretariat building

తెలంగాణ నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు మంజురూ చేసింది. ఏడు అంతస్తులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న సచివాలయం డిజైన్‍కు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో ఆర్‍అండ్‍బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తుందని అధికారులు తెలిపారు. ఆ వెంటనే టెండర్లు పిలిచే అవకాశం ఉన్నది.