AP High Court Serious Serious Questions to YS Jagan Govt over AP 3 Capital Bill

ప్రస్తుతం ఏపీ రాజధాని అంశం హైకోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు తదుపరి విచారణను 14 వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చు అని వైకాపా ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి రాజధాని పై దాఖలైన 2 పిటీషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో పాటు విచారణ సందర్భంగా బుధవారం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించడం, రాజధాని మారిస్తే ప్రజాధనం వృధా కాదా అంటూ నిలదీయడం వంటివి వైకాపా ప్రభుత్వ వర్గాల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయని అంటున్నారు. వైకాపా లో తీర్పు పట్ల సందేహాలు పెరుగుతున్నాయి అనే దానికి మంత్రి పేర్ని నాని బుధవారం చేసిన వ్యాఖ్యలు కూడా ఊతమిస్తున్నాయి. బుధవారం రాజధాని అంశంపై మాట్లాడిన మంత్రి పేర్ని నాని 3 రాజదానులపై జగన్ వెనక్కి తగ్గరని అన్నారు. దీనిపై అవసరం అయితే సుప్రీంకోర్టు కు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. హైకోర్టు లో ఇంకా విచారణ కూడా పుంజుకోకముందే సుప్రీం కు వెళ్తామని మంత్రి వ్యాఖ్యానించడం వెనుక హైకోర్టు తీర్పు సై ప్రభుత్వం లో నెలకొన్న సందేహాలకు నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు.