AP Local Body Elections 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక ఎన్నిక‌లు ఇప్పుడ‌ప్పుడే జ‌రిగే ప‌రిస్థితులు లేన‌ట్టే. ఈ విష‌యంపై ప్ర‌భుత్వ‌మే ప‌రోక్ష సంకేతాలు ఇచ్చింది. గ‌త మార్చి నుంచి పంచాయితీలు, మునిసిపాలిటీల‌లో తాత్కాలికంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ప్ర‌త్యేకాధికారుల పాల‌న‌ పొడిగిస్తూ ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 108 మునిసిపాలిటీలు, పంచాయితీల‌లో ప్ర‌త్యేక అధికారుల పాల‌న మ‌రికొంత కాలం కొన‌సాగ‌నుంది. స్థానిక ఎన్నిక‌ల‌ను క‌రోనా కార‌ణంగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ వాయిదా వేయ‌డం త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌లో ఆయ‌న్ను ప్ర‌భుత్వం తొల‌గించ‌డం, తిరిగి కోర్టు ఆదేశాల‌తో ఆయ‌న్నుఎస్ఇసిగా ఇటీవ‌లే నియ‌మించ‌డం తెలిసిందే.