American appliance brand White Westinghouse enters India

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కన్స్యూమర్‍ అప్లయెన్సెస్‍ అండ్‍ వైట్‍వెస్టింగ్‍ హౌస్‍ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. రూ.300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా అమెజాన్‍ డాట్‍ ఇన్‍పై సెమీ ఆటోమేటిక్‍ వాషింగ్‍ మెషీన్లను సంస్థ ఆవిష్కరించింది. త్వరలోనే 3 లక్షల చదరపు అడుగులలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న సంస్థ సీనియర్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ పల్లవీ సింగ్‍ వెల్లడించారు. కొత్త వాషింగ్‍ మెషీన్‍లు 7 కేజీలు, 8 కేజీలు, 9 కేజీల విభాగాలలో రూ.7499 ఆరంభ ధరతో అందుబాటులో ఉంటాయని అన్నారు.