Professor Allan Lichtman predicts Joe Biden will beat Donald Trump

అమెరికన్ అధ్యక్ష ఎన్నికల పోటీ లో అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కంటే ఆధిక్యంతో కొనసాగుతున్న సమయంలో 1984 నుండి 2016 వరకు ఎప్పుడు తప్పని “13 సూత్రాల” అలన్ లిచ్ట్మాన్ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల అంచనా ప్రకారం మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ నవంబర్ లో జరగనున్న అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ను ఓడిస్తారని ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ బుధవారం ఆగస్టు 5th న ప్రకటించినట్టు యుఎస్ఎ టుడే తెలిపింది.

అయతే అమెరికన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ సర్వే రిపోర్ట్ కు ప్రత్యేకత ఉంది. ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ 1984 నుండి 2016 వరకు వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన ప్రతి అద్ధ్యక్షులు తన 13 సూత్రాలతో అంచనా వేసిన వారే. రాజకీయ చరిత్రకారులు లిచ్ట్మాన్, 2016 లో ట్రంప్ 45 వ అద్ధ్యక్షులు అవుతారు అని అంచనా వేసిన కొద్దిమంది భవిష్య సూచకులలో ఒకరు, ట్రంప్ అధ్యక్షుడిగా అభిశంసనకు గురవుతారని కూడా అంచనా చెప్పినట్టు తెలిసింది.