new-york-schools-among-few-top-10-districts-reopening-schools-for-in-person-learning

అమెరికా అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు చాలా విద్యా సంస్థలు ఇన్-క్లాస్ బోధనను ప్రారంభించగా. గురువారం 30 జూలై ఇండియానా లోని గ్రీన్ఫిల్డ్ సెంట్రల్ జూనియర్ హై స్కూల్ లో ఒక భారత విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది మరియు పలు విద్యాసంస్థలలో ఉపాధ్యాయులకు కూడా వైరస్ సోకినట్లు తెలిసింది.

కొన్ని వారాల క్రితం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ (AFT ) సమ్మె చేస్తాం అని హెచ్చరించిన కొన్ని రోజుల క్రితం చికాగో లోని విద్యా సంస్థలు కూడా ఇన్-క్లాస్ బోధనను ప్రారంభిస్తాయి అని చికాగోకు చెందిన మేయర్ లోరీ లైట్‌ఫుట్ తెలియజేయగా,చికాగో టీచర్స్ యూనియన్ విద్యాసంస్థల భద్రతపై సమ్మెకు తాత్కాలిక సన్నాహాల చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు విద్యాసంస్థలకు వారి పిల్లలను పంపటానికి భయపడుతున్న సమయం లో అమెరికా లోని మూడవ అతిపెద్ద జిల్లా అయినా చికాగో లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దృష్ట్య సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం ఆన్లైన్ లో మాత్రమే ప్రారంభించబడుతుంది అని చికాగోకు చెందిన మేయర్ లోరీ లైట్‌ఫుట్ మరియు చికాగో పబ్లిక్ స్కూల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జానైస్ జాక్సన్ ప్రకటించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.