Lady bosses in dil raju production

రాజకీయ రంగం అయినా సినిమా రంగం అయినా, లాయర్లయినా, డాక్టర్లయినా ఏ రంగం లోనైనా వారసులు వుండాల్సిందే. ఎందుకంటే ఒంటరిగా నిలపెట్టుకున్న తమ ఇమేజ్ ని తరువాత తరం తో కూడా పంచుకోడానికి తానేమిటో తన పేరు కలకాలం గుర్తు వుండాలని కష్టపడి నిర్మించిన సామ్రాజ్యానికి ఎక్కడైనా వారసత్వం తప్పదు. టాలీవుడ్ లో ఒకరైన దిల్ రాజు కష్టపడి ఓ సామ్రాజ్యాన్నినిర్మించుకున్నారు థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణాలు ఇలా అన్ని వైపులా విస్తరించారు. ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి వారసుల్ని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కుమార్తె హన్షిత చాలా ఏళ్ల క్రితమే కొన్నాళ్ల పాటు థియేటర్ల వ్యవహారాలు చూసారు. కానీ ఆ తరువాత కుటుంబ వ్యవహారాలతో దూరంగా వున్నారు. ఇప్పుడు మళ్లీ ఆమె ఆఫీసుకు వస్తున్నారు. థియేటర్ల వ్యవహారాలను ఫైనల్ స్టేజ్ అక్కౌంట్స్ అన్నీ ఆమె సూపర్ వైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు పార్టనర్, బంధువు హర్షిత్ రెడ్డి భార్య గౌతమి కూడా నిత్యం ఆఫీసుకు వస్తున్నారు. ఆమె ఆర్ట్ డిపార్ట్ మెంట్ వ్యవహారాలు, ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద దిల్ రాజు సంస్థకు వారసులు వచ్చినట్లయింది.

దాదాపు ముఫైకి పైగా థియేటర్లు, డజనుకు పైగా సినిమా నిర్మాణాలు, అనేక సినిమాల పంపిణీ కార్యక్రమాలు వుండడంతో మ్యాన్ పవర్ అవసరం. ఇప్పటికే శిరీష్ థియేటర్ల ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. దిల్ రాజు కథలు, నిర్మాణాలు చూసుకుంటున్నారు. హర్షిత్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ లో వున్నారు. వీరికి తోడుగా లేడీ బాస్లు వచ్చారన్నమాట.