double dhamaka on mahesh babu birthday gifts

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. మహేష్ మాస్, క్లాస్ మూవీస్ రెండూ చేస్తాడు కానీ ఎక్కువగా క్లాసికల్ టచ్ తో ఉంటాడు, దాంతో ఫ్యాన్స్ కూడా ఆయనలాగానే డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఇలా కమిట్మెంట్ ఉన్న ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో మహేష్ కి ఉండడం విశేషం.

ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో సూపర్ హిట్ తో మహేష్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన సర్కార్ వారి పాట అంటూ కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. అది కూడా తన  తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ బర్త్ డే వేళ పోస్టర్ రిలీజ్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజానికి ఈ పాటికి కరోనా లేకపోతే కనీసం రెండు షెడ్యూల్స్ అయినా మూవీ షూటింగు పూర్తి చేసుకునేది. కానీ ఇపుడు ఎటూ కాలు కదిపేలా లేదు. ఈ టైంలో ఫ్యాన్స్ కి మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబు బర్త్ డే ఈ నెల 9న వస్తోంది. ఈ బర్త్ డేకి ఫ్యాన్స్ కి మహేష్ గిఫ్ట్ ఏంటి అన్నది చర్చగా ఉంది. అయితే మహేష్ బాబు నుంచి సర్కార్ వారి పాట నుంచి ఏమీ న్యూ అప్ డేట్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. వారికి అనూహ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ వస్తుందని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ట్రాక్ ఆ రోజున రిలీజ్ చేస్తారని అంటున్నారు. అదే రోజు సర్కార్ వారి పాట డిజిటల్ పోస్టర్ కూడా విడుదల చేస్తారు. మొత్తం మీద చూస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ వచ్చిందన్నమాటే ఇదిలా ఉండగా ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. బ్యాంకుల్లో జరిగే అవినీతి అక్రమాల మీద బేస్ చేసుకుని ఈ మూవీ తీస్తున్నారు అంటున్నారు. మహేష్ కెరీర్లో ఇది కొత్త  డైమన్షన్  మూవీ అని చెబుతున్నారు.