Vice President s family donates Rs 10 lakhs

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‍ వెంకయ్య నాయుడు కొవిడ్‍పై పోరాటానికి, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి రూ. 5లక్షల చొప్పున విరాళం అందించారు. అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ సందర్భంగా, వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో వెంకయ్య సతీమణీతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి టీవీ ద్వారా వీక్షించారు.