Jagan runs away from taking challenge says Chandrababu Naidu

ఎన్నికల ముందు జగన్‍ ఏం చేప్పారు, ఇప్పుడేం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. జగన్‍, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. మీరు చేసే పనులు సరైనవని అనిపిస్తే ఎన్నికలకు వెళ్లాలని సవాల్‍ విసిరారు. ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. అన్నీ మరిచిపోయి ఇవాళ మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికల ముందే చెప్పానని గుర్తు చేశారు. వేలాది మంది రైతులు రహదారులపై ఆందోళన చేస్తున్నారన్నారు.

అమరావతిపై మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం రండి అని సవాల్‍ విసిరారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా, కాంగ్రెస్‍ నేతలు జగన్‍ను నిలదీయాలన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పు అని హితవు పలికారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పారు. రాజధానిని మార్చే అధికారం మీకు లేదని చంద్రబాబు సృష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధ•తం చేస్తామని వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజలు మాతో కలిసి రావాలని కోరారు. నీతికి, నిజాయతీకి మారు పేరు విశాఖ వాసులు అని చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించండి, మా పదవులు వదిలేస్తామని వెల్లడించారు. 2014లో అన్యాయం జరిగింది. మళ్లీ మళ్లీ మోసపోవడం తగదని పేర్కొన్నారు.