Coronavirus Positive Cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2012 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 70,958కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‍ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 576కి చేరింది. కరోనా నుంచి నిన్న 1139 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్‍ను జయించిన వారి సంఖ్య 50,814కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‍ కేసుల సంఖ్య 19,568కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‍లో తెలిపింది.

నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‍ఎంసీ పరిధిలో 532 పాజిటివ్‍ కేసులు ఉన్నాయి. మేడ్చల్‍ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్‍ అర్బన్‍లో 127, ఖమ్మం 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‍ 83, నల్గొండలో 49, పెద్దపల్లి జిల్లాలో 41, మహబూబ్‍నగర్‍లో 51, జోగులాంబ గద్వాల్‍ జిల్లాలో 48, జయశంకర్‍ భూపాలపల్లి జిల్లాలో 46, భదాద్రి కొత్తగూడెంలో 52, కరీంనగర్‍ 41, కామారెడ్డిలో 75 కేసులు నమోదయ్యాయి.