Trump Moves to Limit Foreign Workers in Federal Agencies

అమెరికా జాబ్‍ మార్కెట్‍పై ఆశలు పెట్టుకున్న భారతీయులకు మరో దుర్వార్త. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్‍ 1 బీ వీసాదారులకు ఫెడరల్‍ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో సృష్టం చేశారు. అన్ని ప్రభుత్వ సంస్థలు నాలుగు నెలల్లోగా అంతర్గత ఆడిటింగ్‍ పూర్తిచేసుకుని,  ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మావన వనరులు ఉండేలా చూసుకోవాలి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న స్వదేశీయులకు ఊరట కల్పించే దిశగా ట్రంప్‍ ఈ నిర్ణయం తీసుకున్నారు.