Indian origin woman researcher killed while jogging in US

అమెరికాలోని టెక్సాస్‍లో భారత సంతతి పరిశోధకురాలు హత్యకు గురయ్యారు. టెక్సాస్‍ రాష్ట్రంలోని ప్లానో నగరంలో 43 ఏళ్ల సర్మిస్త సేన్‍ నివసిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన అమె చిషోల్మర్‍ ట్రెల్‍ పార్కు వద్ద జాగింగ్‍ చేస్తుండగా దుండగులు హత్యచేశారు. సేన్‍ మృతదేహం లెగసీ డ్రైవ్‍, మార్చమన్‍ వే సమీపంలోని క్రీక్‍ ప్రాంతంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. సర్మిస్తసేన్‍ మాలిక్యూలర్‍ బయాలజీ విభాగంలో ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నల్లు తెలిపారు. కాగా హత్యలో సంబంధం ఉన్న 29 ఏళ్ల నిందితుడు బకారి అభియోనా మోన్‍క్రీప్‍ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు బకారిని పోలీసులు కొల్లీన్‍ కౌంటీ జైలులో ఉంచి విచారిస్తున్నారు.