Ram dhun reverberates across continents Indian community in US celebrates Ram temple bhoomi pujan

అయోధ్య ఆలయ పునాది కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమెరికాలోని భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. రామాలయం డిజిటల్‍ చిత్రాలను ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూమి పూజ సందర్భంగా దీపాలను వెలిగిస్తామని చెప్పారు. పెద్ద ఎల్‍ఈడీ స్క్రీన్‍ కలిగిన ట్రక్‍ పై రామాలయ చిత్రాలను ప్రదర్శిస్తూ వైట్‍ హౌజ్‍ సహా కాపిటల్‍ హిల్‍ ప్రాంతంలో ఊరేగించనున్నట్లు చెప్పారు. వర్చువల్‍లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అక్కడి పూజారుల సంఘం తెలిపింది. టైమ్స్ స్క్వేర్‍ వద్ద రాముడి చిత్రాలను, రామాలయ త్రీడీ చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించింది.